Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హక్కుల కోసం జర్నలిస్టుల గళం.. గాంధీ విగ్రహానికి వినతిపత్రం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 07:21 PM

గాంధీజీని ఆదర్శంగా తీసుకుని మంచి పౌరులుగా మారాలి..

02-10-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

గాంధీజీని ఆదర్శంగా తీసుకుని మంచి పౌరులుగా మారాలి

నల్గొండ జిల్లా జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం

​కలెక్టర్ బి. చంద్రశేఖర్, న్యాయమూర్తులు హాజరు

​నల్గొండ : జైలు జీవితం నుంచి విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నల్గొండ జిల్లా జైలులో నిర్వహించిన ‘ఖైదీల సంక్షేమ దినోత్సవానికి’ ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఖైదీలు విడుదలయ్యాక నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. మార్పు అనేది ముందుగా మన నుంచే ప్రారంభం కావాలని సూచించారు. "పాఠశాలల్లో ఎక్కువ మంది, జైళ్లలో తక్కువ మంది ఉన్నప్పుడే ఆ సమాజం బాగుపడుతుంది" అని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో విద్యకు ఎంతో ప్రాధాన్యం పెరిగిందని, జైలులో చదువురాని ఖైదీలకు బోధకులను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం తరఫున చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షాకాలాన్ని పూర్తి చేసుకుని బయటకు వెళ్లాక నిర్దిష్ట లక్ష్యంతో జీవించాలని, స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.

​ఓర్పు, సంస్కారం అలవర్చుకోవాలి..

జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి కె. కవిత మాట్లాడుతూ.. ఖైదీలు జైలులోని సౌకర్యాలను వినియోగించుకుంటూ ఓర్పు, సంస్కారాలను అలవర్చుకుని మంచి మనుషులుగా బయటకు రావాలని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి హిమబిందు మాట్లాడుతూ.. ఖైదీలు మానవతా విలువలను, ఆరోగ్య సూత్రాలను పాటించాలని, తమను తాము దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

​అదనపు ఎస్పీ రమేష్ మాట్లాడుతూ.. చిన్న చిన్న పొరపాట్లతో జైలుకు వచ్చిన వారు చట్టాలపై, సమాజంపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ కె. ఆనందరావు, డాక్టర్ కిరణ్ తదితరులు ప్రసంగించారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన ఖైదీలకు కలెక్టర్, న్యాయమూర్తులు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జైలర్లు అచ్చయ్య, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గాంధీజీని ఆదర్శంగా తీసుకుని మంచి పౌరులుగా మారాలి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News