రామన్నపేట: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఆధారరహితమని నకిరేకల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నకిరేకంటి మొగులయ్య అన్నారు. మంగళవారం రామన్నపేటలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సంఘం వ్యవహారాలపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు రాజకీయ ఆరోపణలేనని పేర్కొన్నారు.
క్యాబినెట్ సెక్రటరీ జోక్యంతో బీజేపీ ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తోందన్న ఆరోపణలకు ఆధారాలు లేవని అన్నారు. ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయంటూ చేస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. ఎస్‌ఐఆర్ షెడ్యూల్, ఇతర విధాన నిర్ణయాలు కమిషన్ ఆమోదంతోనే వెలువడుతున్నాయని పేర్కొన్నారు.
ఫామ్–6కు సంబంధించిన ప్రక్రియపై కూడా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మొగులయ్య ఆరోపించారు. అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫామ్–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం అధికారిక సమాచారం కూడా పేర్కొంటోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి