భక్తుల సౌకర్యార్థం రూ.30 వేల విలువైన దృశ్యదర్శిని అందజేత
పిల్లలమర్రి: కార్తీక మాసంతో పాటు ఇతర పర్వదినాల్లో శ్రీ ఎరకేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ సమయంలో గర్భాలయంలో స్వామివారికి నిర్వహించే అభిషేకాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రముఖ భౌతిక చికిత్స నిపుణుడు డాక్టర్ కోసనం వేణుగోపాల్ రెడ్డి భక్తుల సౌకర్యార్థం ముందుకొచ్చారు. రూ.30 వేల విలువైన 55 అంగుళాల తెరను ఆలయానికి విరాళంగా అందజేశారు. ఈ తెర ద్వారా గర్భాలయంలో స్వామివారికి నిర్వహించే అభిషేక దృశ్యాలను భక్తులు సులభంగా వీక్షించేందుకు అవకాశం కలగనుంది. భక్తుల ఇబ్బందులను గుర్తించి ఆలయానికి విలువైన బహుమతిని అందజేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి