Sthanikam - Truth Matters
Logo

దసరా ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసుల చర్యలు

Updated : 17 Oct 2026 15:19 IST
As Preferred Source 1 min read
దసరా ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసుల చర్యలు

చిట్యాల ఎస్‌బీఐ వద్ద యూటర్న్‌ మూసివేత.. ట్రాఫిక్‌ను పర్యవేక్షించిన డీఎస్పీ.

చిట్యాల: దసరా పండుగ నేపథ్యంలో జాతీయ రహదారి-65 (ఎన్‌హెచ్‌-65)పై వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ ఆదేశాల మేరకు చిట్యాల పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకు వద్ద ఉన్న యూటర్న్‌ను తాత్కాలికంగా మూసివేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ శివరామ్‌ రెడ్డి, నార్కట్‌పల్లి సీఐ సురేష్‌, చిట్యాల ఎస్‌ఐ వెంకట్‌ రెడ్డితో పాటు పోలీసు సిబ్బందికి ట్రాఫిక్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం డీఎస్పీ స్వయంగా క్షేత్రస్థాయిలో ట్రాఫిక్‌ పరిస్థితిని పరిశీలిస్తూ పర్యవేక్షించారు.

దసరా పండుగ సందర్భంగా వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌ అంతరాయాలు, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వాహనదారులు పోలీసుల సూచనలు పాటిస్తూ ట్రాఫిక్‌ నియంత్రణకు సహకరించాలని పోలీసులు సూచించారు.

Sthanikam

దసరా ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసుల చర్యలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి