వట్టిమర్తికి చేరుకున్న సాయిభక్తుల బృందం.
చిట్యాల: లోకకల్యాణం, ప్రజల సుఖసంతోషాలను ఆకాంక్షిస్తూ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలోని చిన్న షిరిడీ సాయిబాబా ఆలయం నుంచి మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయం వరకు 15వ మహా పాదయాత్ర చేపట్టారు. శానంపూడి శ్రీహరి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న ప్రారంభమైన ఈ పాదయాత్ర గురువారం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చేరుకుంది.
ఈ సందర్భంగా ఆలయ మేనేజింగ్ ట్రస్టీ శానంపూడి శ్రీహరి మాట్లాడుతూ సాయిబాబా సమాధి చెంది 108 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. రోజుకు 35 నుంచి 40 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణిస్తున్నామని, లోకకల్యాణం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో షిరిడీ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
పాదయాత్రలో మండాది కొండారెడ్డి, చల్లా శ్రీనివాసరావు, ఎక్కంటి చంద్రశేఖర్‌రెడ్డి, కడియాల ప్రకాశరావు, కట్టారాపు విజయ్, అవులూరి రామకృష్ణారెడ్డి, అవులూరి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి