Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఒకే భూమిని పలువురికి విక్రయించే యత్నం.. ఏడుగురిపై కేసు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 27, 2026 07:30 PM

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి – విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

27-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యతోపాటు విలువలు నేర్పా

భువనగిరి: విద్యార్థులకు పాఠ్యాంశాలతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, దేశభక్తిని నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

భువనగిరిలోని సుమంగళి ఫంక్షన్‌హాల్‌లో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పాలకూర్ల వెంకటేష్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీరాములు ఆధ్వర్యంలో ఆదివారం గురుపూజోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులు సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

127 పాఠశాలల ప్రతినిధులకు సన్మానం

జిల్లాలోని 17 మండలాలకు చెందిన 127 పాఠశాలల కరస్పాండెంట్లు, ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు, మెమొంటోలు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక బోధనా పద్ధతులు అవలంబించి విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రశ్నించే తత్వం, నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్‌ రూపకల్పనలో తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. బడ్జెట్‌ పాఠశాలల కరస్పాండెంట్ల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్‌, ట్రస్మా గౌరవ అధ్యక్షులు మెరుగు మధు, గాదె సోమిరెడ్డి, కోశాధికారి వంగూరి పాండు, నాయకులు మిర్యాల దుర్గప్రసాద్‌, కాటా చిన్నప్ప, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి – విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News