ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం.
రామన్నపేట, సెప్టెంబర్ 26 స్థానికం ప్రతినిధి:
రామన్నపేట మండల స్థాయిలో 2026 సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం ఘనంగా సన్మానించారు. స్థానిక మచ్చగిరి ఫంక్షన్ హాల్‌లో శనివారం ఎంఈఓ టి. సురేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం ద్వారా ఇతర ఉపాధ్యాయులకు కూడా ప్రోత్సాహం కలుగుతుందని అన్నారు.
కార్యక్రమంలో తాసిల్దార్ లాల్ బహుదూర్,
మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి,
ఎంపీడీవో రాములు,ప్రధానోపాధ్యాయులు దొడ్డి స్వామి, కె. శేఖర్, శేషాచారి, అవార్డు గ్రహీతలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి