రూ.50.53 లక్షల విలువైన నోట్ పుస్తకాలు, వైద్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్
పరిసర ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి, విద్యా సంస్థల పురోగతికి దివిస్ పరిశ్రమ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని దేవలమ్మ నాగారం గ్రామ సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం దివిస్ పరిశ్రమ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.అనంతరం దివిస్ యాజమాన్యం సమకూర్చిన రూ. 50,53,560ల విలువ గల 1,25,270 నోట్ పుస్తకాలను సర్పంచ్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా గౌరీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పరిసర గ్రామాల సమగ్ర అభివృద్ధికి, పేద విద్యార్థుల చదువులకు దివిస్ యాజమాన్యం అందిస్తున్న సహకారం మరువలేనిదని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అనూప్ రెడ్డి, వార్డు సభ్యురాలు అమరావతి, చైర్‌పర్సన్ సుగుణమ్మ, దివిస్ పరిశ్రమ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి