Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన జడ్పీ సీఈవో శోభారాణి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 24, 2026 10:49 PM

దివ్యాంగుల సమస్యలపై వీసీకి వినతి

దివ్యాంగుల సమస్యలపై వీసీకి వినతి

దివ్యాంగుల సమస్యలపై వీసీకి వినతి
24-09-2026 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ను విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు.దివ్యాంగుల హక్కుల చట్టం–2016 (RPwD Act)పై విశ్వవిద్యాలయంలో ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. అశోక్‌ కోరారు. సాధారణ విద్యార్థులకు సైతం దివ్యాంగుల హక్కులు, చట్టపరమైన రక్షణలు, సమాన అవకాశాలపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.చట్టం ప్రకారం విశ్వవిద్యాలయంలో దివ్యాంగులకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించడంతో పాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దివ్యాంగ విద్యార్థులకు నైపుణ్య ఆధారిత విద్య అందించాలని, వారి అర్హతకు అనుగుణంగా అన్ని కోర్సుల్లో సమాన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విద్యాభ్యాసంలో ఎలాంటి వివక్షకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని వీసీకి వివరించారు.

దీనిపై వీసీ సానుకూలంగా స్పందిస్తూ దివ్యాంగుల హక్కుల చట్టం–2016పై అవగాహన సదస్సు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో ఫోరం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మారవేణి చంద్రశేఖర్‌ యాదవ్, రాష్ట్ర సహాయక కార్యదర్శి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దివ్యాంగుల సమస్యలపై వీసీకి వినతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News