ప్రపంచ చెవిటితన దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి. సౌజన్య ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగుల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అందుబాటులో ఉన్న న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. వినికిడి లోపం ఉన్న పిల్లలు, ఇతర దివ్యాంగులు తమ హక్కులను తెలుసుకొని అవసరమైనప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. దివ్యాంగుల పట్ల సమాజంలో సమానత్వం, గౌరవం, సహానుభూతి కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ, ఆర్‌ఎంఓ రవి కుమార్, ఈఎన్‌టీ విభాగాధిపతి, వైద్యులు, సిబ్బంది, వినికిడి లోపం ఉన్న చిన్నారులు పాల్గొన్నారు.
దివ్యాంగుల హక్కులు తెలుసుకోవాలి: సీనియర్ సివిల్ జడ్జి

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి