సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జి. అంజయ్య, కార్యదర్శి యం. మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకుని స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లాది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన మహాత్మా గాంధీ జీవితం యావత్ మానవాళికి ఆదర్శమని వారు పేర్కొన్నారు. సత్యం, అహింస, సహనం, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి విలువలను గాంధీజీ ఆచరణలో చూపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, గ్రంథాలయ సిబ్బంది, సీనియర్ సిటిజన్లు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 02, 2026 04:51 PM
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా గాంధీ జయంతి

02-10-2026
55 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జి. అంజయ్య, కార్యదర్శి యం. మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకుని స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లాది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన మహాత్మా గాంధీ జీవితం యావత్ మానవాళికి ఆదర్శమని వారు పేర్కొన్నారు. సత్యం, అహింస, సహనం, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి విలువలను గాంధీజీ ఆచరణలో చూపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, గ్రంథాలయ సిబ్బంది, సీనియర్ సిటిజన్లు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి