నేలపట్లలో ఘనంగా ప్రపంచ పర్యావరణ ఆరోగ్య సదస్సు
విద్యార్థులకు నీతి కథలు, గృహస్థులకు భగవద్గీత గ్రంథాల పంపిణీ: ఫౌండేషన్ చైర్మన్ పాలకుర్ల మురళి గౌడ్
ధర్మబద్ధమైన జీవన విధానం వల్ల సమాజానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని 'పాల కుర్ల శివయ్య గౌడ్ ఫౌండేషన్' చైర్మన్ పాలకుర్ల మురళి గౌడ్ పేర్కొన్నారు. చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల గ్రామంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ ఆరోగ్య సదస్సును ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు "వినీల ఆకాశం - స్వచ్ఛమైన గాలి" అనే అంశంపై అవగాహన కల్పించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ పాలకుర్ల మురళి గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు నీతి కథల పుస్తకాలను, గృహస్థులకు భగవద్గీత గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త బడుగు శ్రీరాములు, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) జిల్లా అధ్యక్షుడు దబ్బటి శేఖర్, సంఘ నాయకులు కమలాకర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి