Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపు: గ్రామసభలో ఓప్పుకున్న సెక్రటరీ! నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 06:06 PM

దేశాన్ని అర్థం చేసుకోవాలంటే హిందీ నేర్చుకోవాలి.తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌.

02-10-2026 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: భారతీయ సమాజ మూలాలను సమగ్రంగా తెలుసుకోవాలంటే సంస్కృతం, ఆంగ్లం, తెలుగుతోపాటు హిందీ భాషను కూడా నేర్చుకోవాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ అన్నారు. దేశ సమగ్ర స్వరూపాన్ని, భారతీయ సామాజిక జీవన వైవిధ్యాన్ని అవగతం చేసుకోవడానికి హిందీ భాష దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని తెలంగాణ బుక్‌ట్రస్ట్‌ కార్యాలయంలో గురువారం మిధున్‌ హిందీ ట్యుటోరియల్‌ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు మిధున్‌ కుమార్‌ రచించిన ‘మిధున్‌ స్పోకెన్‌ హిందీ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. భారత ప్రభుత్వ హిందీ సలహా సమితి సభ్యుడు శ్రుతికాంత్‌ భారతి, రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ చైర్మన్‌ నారా కిషోర్‌రెడ్డి, అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ స్టూడెంట్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ వై. వెంకటేశ్వర్లు, జూలూరు గౌరీశంకర్‌ సంయుక్తంగా పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ భారతదేశం విభిన్న భాషల కూడలిగా ఉందని, ప్రజలను అనుసంధానించడంలో హిందీ కీలక భాషగా పనిచేస్తోందన్నారు. హిందీ, తెలుగు, ఆంగ్ల భాషల మాధ్యమాలతో పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. నిత్య జీవితంలో ఉపయోగించే సరళమైన పదాలతో భాషను నేర్పితే సులభంగా అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కార్పొరేట్‌ రంగంలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించుకోవడానికీ హిందీ ఉపయోగపడుతుందని తెలిపారు.

శ్రుతికాంత్‌ భారతి మాట్లాడుతూ భాషను సరళమైన వ్యవహారిక రూపంలో అందించినప్పుడే అందరికీ చేరువవుతుందన్నారు. హిందీ భాషాభ్యాసాన్ని సులభతరం చేస్తూ ఆసక్తికరంగా పుస్తకాన్ని రూపొందించిన మిధున్‌ కుమార్‌ను నారా కిషోర్‌రెడ్డి, వై. వెంకటేశ్వర్లు అభినందించారు.

మిధున్‌ కుమార్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో పనిచేసిన సమయంలో భాషాపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ఆ అనుభవంతో హిందీని సాధన చేసి నేర్చుకున్నానన్నారు. హిందీపై అవగాహన లేక చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ఉత్తర భారతంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి హిందీ వారధిగా పనిచేస్తుందని చెప్పారు. అనంతరం మిధున్‌ కుమార్‌ను పలువురు సన్మానించారు.

Sthanikam

దేశాన్ని అర్థం చేసుకోవాలంటే హిందీ నేర్చుకోవాలి.తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News