Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:13 PM

చిట్యాల వద్ద NH-65 పై ట్రాఫిక్ తాకిడి – వరుస సెలవుల ఎఫెక్ట్,

23-03-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

విజయవాడ–హైదరాబాద్ మార్గంలో వాహనాల రద్దీ…

రోడ్డు మరమ్మతులతో కిలోమీటర్ల మేర జాం

నల్గొండ జిల్లా చిట్యాల కేంద్రంలో నేషనల్ హైవే–65 పై ఆదివారం భారీ ట్రాఫిక్ నెలకొంది. వరుస సెలవుల నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరడంతో వాహనాల రద్దీ అమాంతం పెరిగింది. రేపు సోమవారం పనిదినం కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు ముందుగానే ప్రయాణం మొదలుపెట్టడం ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రమైంది.

విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ దిశగా భారీగా వాహనాలు తరలివస్తుండగా, చిట్యాల వద్ద రోడ్డు మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది.

హైవే పై ఒత్తిడి పెరగడంతో అనేక వాహనాలు సర్వీస్ రోడ్లపైకి మళ్లించబడగా, అక్కడ కూడా వాహనాలు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, వాహనాల అధిక రద్దీ కారణంగా పరిస్థితి అదుపులోకి రావడం కష్టంగా మారింది. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Sthanikam

చిట్యాల వద్ద NH-65 పై ట్రాఫిక్ తాకిడి – వరుస సెలవుల ఎఫెక్ట్,

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News