Sthanikam - Truth Matters
Logo

చిట్యాల మున్సిపాలిటీలొ బిఆర్ఎస్ దూకుడు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

Updated : 07 Feb 2026 15:23 IST
As Preferred Source 1 min read
చిట్యాల మున్సిపాలిటీలొ బిఆర్ఎస్ దూకుడు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

నల్లగొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. 5వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిర్రబోయిన సమత, 6వ వార్డు అభ్యర్థి జడల సంతోషికి మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో గడపగడపకు వెళ్లి స్థానిక ప్రజలను కలిసిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను వివరించారు. రైతుబంధు, దళితబంధు, ఆసరా పింఛన్లు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలకు జరిగిన లాభాలను గుర్తు చేస్తూ, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరారు. ఇప్పటికే ప్రచారంలో ఉత్సాహం నెలకొందని, ప్రజల నుంచి అనుకూల స్పందన లభిస్తోందని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. స్థానిక సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, చిట్యాల మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా తమ పార్టీకే ఉందని నేతలు ధీమా వ్యక్తం చేశారు.ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీలొ బిఆర్ఎస్ దూకుడు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

Article Image

నల్లగొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. 5వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిర్రబోయిన సమత, 6వ వార్డు అభ్యర్థి జడల సంతోషికి మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో గడపగడపకు వెళ్లి స్థానిక ప్రజలను కలిసిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను వివరించారు. రైతుబంధు, దళితబంధు, ఆసరా పింఛన్లు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలకు జరిగిన లాభాలను గుర్తు చేస్తూ, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరారు. ఇప్పటికే ప్రచారంలో ఉత్సాహం నెలకొందని, ప్రజల నుంచి అనుకూల స్పందన లభిస్తోందని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. స్థానిక సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, చిట్యాల మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా తమ పార్టీకే ఉందని నేతలు ధీమా వ్యక్తం చేశారు.ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి