Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

చిట్యాల డంపింగ్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం

06-04-2026 237 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

దట్టమైన పొగతో శివునేనిగూడెం ముసురుకుపోయింది – ప్రజల్లో ఆందోళన

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని 1వ వార్డులో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

డంపింగ్ యార్డ్‌లో నిల్వ ఉన్న ప్లాస్టిక్‌తో పాటు ఇతర వ్యర్థ పదార్థాలకు మంటలు అంటుకోవడంతో అగ్ని వేగంగా వ్యాపించింది. ఈ మంటల వల్ల భారీగా ఎగసిపడుతున్న దట్టమైన పొగ సమీపంలోని శివునేనిగూడెం గ్రామాన్ని పూర్తిగా కమ్మేసింది.

గాలి దిశ గ్రామం వైపుకు ఉండటంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పొగ కారణంగా స్థానిక ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళనకు గురవుతున్నారు.

సమాచారం అందుకున్న స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా, వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినట్లు తెలిసింది. అగ్నిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది.

Sthanikam

చిట్యాల డంపింగ్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News