Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి : పచ్చిపాల రామకృష్ణ యాదవ్ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 05:24 AM

చిట్యాల ఆరో వార్డు లేఅవుట్‌కు అనుమతులేవు

02-10-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఆర్టీఐతో వెలుగులోకి వచ్చిన వివరాలు.. మున్సిపల్ అధికారుల స్పష్టీకరణ.

చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు వెంకటాపురం సమీపంలోని సర్వే నంబర్‌ 308లో ఏర్పాటు చేసిన లేఅవుట్‌కు మున్సిపల్‌ అనుమతులు లేవని అధికారులు స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం–2005 కింద సంతోష్‌నగర్‌కు చెందిన కాలిన శ్రీశైలం దాఖలు చేసిన దరఖాస్తుకు మున్సిపల్‌ అధికారులు అధికారికంగా సమాధానం ఇచ్చారు.

సదరు లేఅవుట్‌కు సంబంధించిన వివరాలు, ప్లాట్ల విస్తీర్ణం, మున్సిపాలిటీకి కేటాయించిన 10 శాతం స్థలం, లేఅవుట్‌ అప్రూవల్‌ ప్రొసీడింగ్స్‌, ఎల్‌పీ కాపీల వివరాలను శ్రీశైలం కోరారు.

దీనిపై స్పందించిన అధికారులు.. గతంలో మున్సిపాలిటీ సిబ్బంది స్థల పరిశీలన నిర్వహించినట్లు తెలిపారు.

అయితే సర్వే నంబర్‌ 308లోని సదరు లేఅవుట్‌కు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు మంజూరు కాలేదని, అందుకు సంబంధించిన రికార్డులు కూడా కార్యాలయంలో అందుబాటులో లేవని స్పష్టం చేశారు. దీంతో అనుమతులు లేకుండా లేఅవుట్‌ ఏర్పాటు చేశారన్న అంశం ఆర్టీఐ సమాధానంతో వెలుగులోకి వచ్చింది.

Sthanikam

చిట్యాల ఆరో వార్డు లేఅవుట్‌కు అనుమతులేవు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News