సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలకు ప్రభుత్వ న్యాయవాది వాకిటి నరసింహారెడ్డి కృతజ్ఞతలు
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో చౌటుప్పల్‌కు రెండు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరయ్యాయని చౌటుప్పల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది వాకిటి నరసింహారెడ్డి తెలిపారు. మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా 200 కొత్త అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు 7 కోర్టులు కేటాయించగా, చౌటుప్పల్‌కు ప్రత్యేకంగా రెండు నూతన కోర్టులను కేటాయించినట్లు పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రజలకు న్యాయసేవలను మరింత చేరువ చేసేందుకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి కోర్టుల మంజూరుకు అంగీకరించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, స్థానిక న్యాయవాదులు, ప్రజల చిరకాల విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిరంతరం కృషి చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త కోర్టుల ఏర్పాటుతో కేసుల విచారణ వేగవంతమై చౌటుప్పల్, పరిసర ప్రాంతాల ప్రజలకు, న్యాయవాదులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ఇది స్థానిక న్యాయప్రక్రియలో ఒక మైలురాయిగా నిలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి