రూ 15 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో 'నగరాభివృద్ధి' పథకం కింద రూ 15.00 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారికంగా శంకుస్థాపన చేసి ప్రారంభించారు. చౌటుప్పల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో సుందరంగా, మౌలిక వసతులతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ అభివృద్ధి పనుల్లో రూ. 8.50 కోట్లతో డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందులో వార్డు నెం. 13 లో రూ. 7 కోట్లతో వలిగొండ రోడ్డు కల్వర్టు, దివి చెరువు, కెజిబివి పాఠశాల నుంచి బి సి హాస్టల్ వరకు, వార్డు నెం. 14 లో రూ. 1 కోటితో నాగులకుంట నుంచి మల్లికార్జున స్కూల్ వరకు, వార్డు నెం. 10 లో రూ. 50 లక్షలతో డ్రైన్ల నిర్మాణం జరగనుంది.అలాగే రూ. 6.50 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించనున్నారు. వార్డు నెం. 08, 09 లలో రూ. 2.50 కోట్లతో జెడ్పిఎచ్ఎస్ స్కూల్, బ్రహ్మంగారి గుడి, ఆర్డీఓ ఆఫీస్ పరిసరాల్లో, వార్డు నెం. 14 లో రూ. 1 కోటితో ఎర్రగోరి నుంచి కాటమయ్య కాలనీ వరకు, మున్సిపాలిటీలోని 1 నుండి 20 వార్డులలో రూ. 3 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, ఆర్‌డీఓ శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు,డి ఈ మనోరమ, ఏ ఈ నితీష్, స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి