Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అదుపుతప్పి బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 30, 2026 01:22 PM

చౌటుప్పల్ సుందరీకరణే లక్ష్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

30-09-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రూ 15 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

​డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో 'నగరాభివృద్ధి' పథకం కింద రూ 15.00 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారికంగా శంకుస్థాపన చేసి ప్రారంభించారు. చౌటుప్పల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో సుందరంగా, మౌలిక వసతులతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.​ఈ అభివృద్ధి పనుల్లో రూ. 8.50 కోట్లతో డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందులో వార్డు నెం. 13 లో రూ. 7 కోట్లతో వలిగొండ రోడ్డు కల్వర్టు, దివి చెరువు, కెజిబివి పాఠశాల నుంచి బి సి హాస్టల్ వరకు, వార్డు నెం. 14 లో రూ. 1 కోటితో నాగులకుంట నుంచి మల్లికార్జున స్కూల్ వరకు, వార్డు నెం. 10 లో రూ. 50 లక్షలతో డ్రైన్ల నిర్మాణం జరగనుంది.​అలాగే రూ. 6.50 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించనున్నారు. వార్డు నెం. 08, 09 లలో రూ. 2.50 కోట్లతో జెడ్పిఎచ్ఎస్ స్కూల్, బ్రహ్మంగారి గుడి, ఆర్డీఓ ఆఫీస్ పరిసరాల్లో, వార్డు నెం. 14 లో రూ. 1 కోటితో ఎర్రగోరి నుంచి కాటమయ్య కాలనీ వరకు, మున్సిపాలిటీలోని 1 నుండి 20 వార్డులలో రూ. 3 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.​ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, ఆర్‌డీఓ శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు,డి ఈ మనోరమ, ఏ ఈ నితీష్‌, స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ సుందరీకరణే లక్ష్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News