Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 26, 2026 05:50 PM

చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు

26-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన చైర్‌పర్సన్, కమిషనర్

పోరాట పటిమ భావితరాలకు స్ఫూర్తిదాయకం: మోగుదాల పావని రమేష్ గౌడ్

తెలంగాణ సాయుధ పోరాట యోధోమణి, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను చౌటుప్పల్ పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, కమిషనర్ వెంకటేశ్వర నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, పోరాట పటిమ భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు "వీరనారి చాకలి ఐలమ్మకు జోహార్లు" అంటూ నినాదాలు చేశారు.ఈ వేడుకల్లో కౌన్సిలర్లు చింతల ఉమామహేశ్వరి సాయిలు, బుడ్డ సురేష్, మహమ్మద్ హన్ను భాయ్, కో-ఆప్షన్ మెంబర్ బాబా షరీఫ్, నాయకులు దేప రాజు, ఊడుగు రమేష్, బత్తుల దాసు పాల్గొని నివాళులర్పించారు.​మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్‌ఓ అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ దీప, జూనియర్ అకౌంటెంట్ మహేష్, శ్రీనాథ్, డబ్ల్యూఓ వినీల, ప్రవళిక, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News