మేళ్లచెరువులో షార్ట్‌సర్క్యూట్‌తో ఘటన.. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
చార్జింగ్ పెడుతున్న సమయంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా బ్యాటరీ బైక్ దగ్ధమైన ఘటన మేళ్లచెరువు ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. స్థానిక ప్రధాన రహదారిలో ఉన్న ఎస్వీ రెడీమేడ్ డ్రెస్సెస్ యజమాని సామల వెంకట్ రెడ్డి సోమవారం ఉదయం ఎప్పటిలాగే తన బ్యాటరీ బైక్‌కు చార్జింగ్ పెట్టారు. కొద్దిసేపటికే షార్ట్‌సర్క్యూట్ కారణంగా బైక్‌కు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి బైక్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న మై హోమ్ సిమెంట్ పరిశ్రమకు చెందిన అగ్నిమాపక వాహనం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం పూర్తిగా చల్లార్చారు. ఈ ఘటనలో బైక్ మాత్రమే దగ్ధం కాగా, ఇతర ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి