Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

నిదానపల్లిలో కామినేని వైద్య శిబిరం. జనరల్ హెల్త్ చెకప్‌కు ప్రజల స్పందన వ్యసన విముక్తిపై అవగాహన కల్పించిన వైద్య బృందం.

Updated : 09 Nov 2026 12:34 IST
As Preferred Source 1 min read
నిదానపల్లిలో కామినేని వైద్య శిబిరం.  జనరల్ హెల్త్ చెకప్‌కు ప్రజల స్పందన వ్యసన విముక్తిపై అవగాహన కల్పించిన వైద్య బృందం.

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నార్కెట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో ఉచిత జనరల్ హెల్త్ చెకప్ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, పలువురు శిబిరంలో పాల్గొని వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.

వ్యసనాలపై అవగాహన.. విముక్తికి వైద్య సేవలు.

వైద్య శిబిరం అనంతరం వైద్య బృందం ప్రజలకు మద్యం, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించింది. వ్యసనాల కారణంగా ఆరోగ్యంతో పాటు కుటుంబ జీవితాలు కూడా చిన్నాభిన్నమవుతున్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో వ్యసన బాధితులకు పునరావాసం కల్పించేందుకు నార్కెట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రిలో ప్రత్యేక డీ-అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. వ్యసనాలకు బానిసైన వారు వైద్య సహాయం పొందడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని తిరిగి ప్రారంభించాలని సూచించింది.

వైద్య బృందం పాల్గొనగా..

ఈ కార్యక్రమంలో డాక్టర్ జయంత్ (ఆర్థోపెడిక్స్), డాక్టర్ అనుష (జనరల్ సర్జరీ), డాక్టర్ రేవతి (జనరల్ మెడిసిన్), మార్కెటింగ్ విభాగం మురళీకృష్ణ, డీ-అడిక్షన్ కౌన్సెలర్ ఎం. నరేష్, నర్సింగ్ సిబ్బంది, నేత్ర వైద్య విభాగం టెక్నీషియన్ సునీత తదితరులు పాల్గొన్నారు

Sthanikam

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి