Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

చలికాలంలో ఎముకలు, కీళ్ల నొప్పులు ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి

Updated : 06 Jan 2026 18:45 IST
As Preferred Source 1 min read
చలికాలంలో ఎముకలు, కీళ్ల నొప్పులు ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి

ఎముకల, కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ ఉపేందర్ సాతెల్లి

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:చలికాలంలో చాలా మందిలో ఎముకలు, కీళ్ల నొప్పులు ఎక్కువగా బదిస్తాయని ఎముకల, కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ ఉపేందర్ సాతెల్లి ఎంబీబీఎస్ ఓఎస్ఎం, ఎంఎస్ ఆర్థో గాంధీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా మోకాళ్లు, నడుము, మెడ, భుజాల నొప్పులు వృద్ధులతో పాటు యువతలో కూడా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కీళ్లలో రక్త ప్రసరణ తగ్గి, కండరాలు గట్టిపడతాయని, దీని కారణంగా నొప్పులు ఎక్కువగా కనిపిస్తాయని డాక్టర్ ఉపేందర్ వివరించారు. ఆర్థరైటిస్, స్లిప్ డిస్క్, సయాటికా, వెన్నెముక సమస్యలు ఉన్నవారిలో ఈ కాలంలో ఇబ్బందులు మరింత పెరుగుతాయని చెప్పారుచలికాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్యలు

మోకాళ్ల కీళ్ల నొప్పులు

వెన్నునొప్పి,నడుము నొప్పి

మెడ నొప్పి, భుజాల గట్టిపడటం

ఉదయం లేవగానే కీళ్ల గట్టితనం

ఆస్టియోఆర్థరైటిస్ సమస్యలు తీవ్రం కావడం

నొప్పుల నుంచి ఉపశమనానికి సూచనలు

చలికాలంలో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఉదయం లేవగానే తేలికపాటి వ్యాయామాలు చేయాలి చలికి తగినట్టుగా శరీరాన్ని కప్పుకొని ఉంచాలి వేడి నీటితో స్నానం చేయడం మేలు

కాల్షియం, విటమిన్ డి ఉన్న ఆహారం తీసుకోవాలి

ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం మానుకోవాలి నొప్పులు ఎక్కువైతే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి

చలికాలంలో స్వీయ వైద్యం ప్రమాదకరమని, నొప్పుల పేరుతో ఇష్టానుసారంగా మందులు వాడటం వల్ల సమస్య మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. సమయానికి వైద్య సలహా తీసుకుంటే ఎముకల, కీళ్ల సమస్యలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు.

Sthanikam

చలికాలంలో ఎముకలు, కీళ్ల నొప్పులు ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news