వెలిమినేడులో ఘనంగా 131వ జయంతి వేడుకలు.
చిట్యాల: భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య పిలుపునిచ్చారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని రజక సంఘ భవనంలో శుక్రవారం ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. దొరల పెత్తనానికి ఎదురొడ్డి అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కిష్టయ్య పేర్కొన్నారు.కార్యక్రమంలో రజక సంఘం ప్రధాన కార్యదర్శి గుండెపురి చంద్రయ్య, ఉపాధ్యక్షుడు గోలి నరసింహ, కార్యవర్గ సభ్యులు గోలి ఆంజనేయులు, వడ్డేపల్లి రాములు, సంఘం నాయకులు గోలి బిక్షమయ్య, గోలి శంకరయ్య, గోలి ఆంజనేయులు, గోలి దుర్గయ్య, గోలి మల్లేష్, గోలి నరేష్, గోలి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి