Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోరంచ పాఠశాలలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 23, 2026 08:09 AM

బోరంచ పాఠశాలలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం

23-09-2026 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి,ఉపాధ్యాయుల బృందం ఆధ్వర్యంలో ‘ఏక్ పెడ్ మా కే నామ్’ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం–2026 నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి వివిధ రకాల మొక్కలను నాటారు. అనంతరం మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని ఉపాధ్యాయులు సూచించారు. మొక్కలు పెంచడం ద్వారా పచ్చదనం అభివృద్ధి చెందడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని తెలిపారు. పాఠశాల ఆవరణను పచ్చదనంతో నింపేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

బోరంచ పాఠశాలలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News