Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:29 PM

బోరంచ గ్రామంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

27-03-2026 196 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామంలో శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినాన్ని గ్రామ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక పూజలు, భజనలు,రాముని కళ్యాణోత్సవ కార్యక్రమాలు నిర్వహించి భక్తులను ఆకట్టుకున్నారు.ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ పెద్దలు గ్రామస్తులు యువత యువకులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు సక్రమంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప,గ్రామ పెద్దలు మూన్నూర్ విఠల్, ఇతర గ్రామ పెద్దలు, మహిళలు, యువత, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి గీతాలు ఆలపిస్తూ శ్రీరాముని ఆశీస్సులు పొందారు. అనంతరం అన్నదానం నిర్వహించి గ్రామ ప్రజలకు ప్రసాదం పంపిణీ చేశారు. గ్రామస్తులంతా ఐక్యంగా కలిసి పండుగను జరుపుకోవడం ఆనందదాయకంగా మారింది. ఈ వేడుకలు గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరింత పెంచాయి.

Sthanikam

బోరంచ గ్రామంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News