లబ్ధిదారులకు నూతనంగా చేయూత పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భువనగిరి పట్టణంలోని ఏకే ప్యాలెస్‌లో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని, భువనగిరి మండల,మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా చేయూత పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. భువనగిరి మండలంలో 1,044 మందికి, భువనగిరి మున్సిపాలిటీలో 850 మందికి కలిపి మొత్తం 1,894 మందికి నూతన పింఛన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని,అర్హులైన అనేకమంది పింఛన్ల కోసం ఎదురుచూసే పరిస్థితి కల్పించిందని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగించిన గత ప్రభుత్వానికి, ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రస్తుత ప్రజా ప్రభుత్వానికి ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. వృద్ధులు,వితంతువులు,దివ్యాంగులు,నిరుపేదలకు చేయూత పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ సామాజిక బాధ్యతగా భావిస్తోందన్నారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పింఛన్ల కోసం ఎదురుచూసిన అర్హులకు నేడు మంజూరు ప్రొసీడింగ్స్ అందడం ప్రజా ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ,సంక్షేమం మరియు అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. భువనగిరి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ,అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా తన వంతు బాధ్యతగా పనిచేస్తానని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్,జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవేస్ చిస్తి, మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ పోతంశెట్టి మంజుల-వెంకటేశ్వర్లు,ఆత్మ కమిటీ చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి,భువనగిరి, చందుపట్ల పాక్స్ చైర్మన్లు పక్కిర్ కొండల్ రెడ్డి,జీలుగు సతీష్ పవన్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు,మండల,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లంల జంగయ్య యాదవ్,కూర వెంకటేశ్, అన్ని గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు,కో-అప్షన్ సభ్యులు,ఇతర ప్రజాప్రతినిధులు,సంబంధిత అధికారులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి