Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌లో ఘనంగా ఉచిత వైద్య, మహా రక్తదాన శిబిరం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 04:48 PM

భోగారం కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడిగా గోగు హరిప్రసాద్

02-10-2026 168 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా గోగు హరిప్రసాద్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంపల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ శాఖ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎన్నిక కార్యక్రమానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పున్న జగన్మోహన్, మార్కెట్ వైస్‌చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, గంగుల రాజిరెడ్డి, పూస బాలకృష్ణ, జినుకల ప్రభాకర్, బత్తుల కృష్ణ, శంబాల వెంకన్న, పిట్టల వెంకట్‌రెడ్డి, ఎండీ అక్రమ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

నూతన కమిటీ ఎన్నిక.

గ్రామ శాఖ గౌరవ అధ్యక్షుడిగా వనం కిష్టయ్య, ఉపాధ్యక్షులుగా జిల్లా దత్తాద్రి, కునూరు రామచంద్రం, ప్రధాన కార్యదర్శిగా గుర్రం లక్ష్మణ్‌బాబు, కార్యదర్శులుగా గుంతకంట్ల గోవర్ధన్‌రెడ్డి, మేడి నరసింహ, ఆవనగంటి ధనుంజయ, కోశాధికారిగా కనుకు మల్లేశం, సహాయ కార్యదర్శిగా రాపోలు సత్యనారాయణ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా గుంజే చంద్రం, మేడి స్వామి, రత్నం నరసింహ, గోగు రమేష్, నేరటి మల్లేశం, జెల్లా యాదగిరి తదితరులను ఎన్నుకున్నారు.

నమ్మకాన్ని నిలబెడతా

తనను గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెడతానని గోగు హరిప్రసాద్ యాదవ్ తెలిపారు. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన సీనియర్ నాయకులు, గ్రామ, మండల కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు మధ్యపురి ఐలయ్య, మాజీ ఎంపీటీసీ గోగు పద్మ సత్తయ్య యాదవ్, గంపల జీవన్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కందగడ్డ రాహుల్, గ్రామ శాఖ అధ్యక్షుడు శిరబోయిన నవీన్ యాదవ్, వార్డు సభ్యుడు సురేష్ యాదవ్, ఎన్‌ఎస్‌యూఐ గ్రామ శాఖ అధ్యక్షుడు కనుకు రాము తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భోగారం కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడిగా గోగు హరిప్రసాద్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News