| రక్తదాన శిబిరం విజయవంతం. |
రామన్నపేట, సెప్టెంబర్ 25 (స్థానిక ప్రతినిధి):
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా బీజేవైఎం నల్లగొండ జిల్లా యువ నాయకుడు అక్కేనపల్లి సైదులు ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. యువకులు, పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం నల్లగొండ జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ యాదవ్, బీజేపీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు మైల నరసింహ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏల్ల సంజీవరెడ్డి, జయరపు రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర నాయకుడు కన్నెగంటి వెంకటేశ్వరచారి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రక్తదానం ప్రాధాన్యతను వివరించి, అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేందుకు యువత ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు పల్లపు దుర్గయ్య, మండల ప్రధాన కార్యదర్శి జంగిలి సత్యనారాయణ, మండల కార్యదర్శి భాత్క నరేష్, రేపాక లింగుస్వామితో పాటు పలువురు బీజేపీ సీనియర్ నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి