నల్లగొండ: భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం నల్లగొండ జిల్లా కో-కన్వీనర్‌గా జమాండ్ల నవీన్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ అందే శ్రీనివాస్ ఆధ్వర్యంలో, నల్లగొండ జిల్లా లేబర్ సెల్ అధ్యక్షుడు ఐథరాజు సిద్ధు ఆదేశాల మేరకు నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు.
పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత, క్రమశిక్షణతో పాటు సమర్థవంతమైన సేవలను గుర్తించి నవీన్‌కుమార్‌రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. పార్టీకి, కార్మికులకు మరింత సేవలందించేలా తన బాధ్యతలను అంకితభావంతో నిర్వహించాలని సూచించారు.
నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ కార్మికుల సంక్షేమానికి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. నవీన్‌కుమార్‌రెడ్డి నియామకం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి