Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:00 AM

బసవేశ్వరుని మార్గంలో నడవాలి – ఎమ్మెల్యే సంజీవరెడ్డి

20-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మండల పరిధిలోని జుక్కల్ గ్రామంలో జగజ్యోతి మహాత్మా బసవేశ్వర స్వామి జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమానికి ప్రత్యేకత తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బసవేశ్వర స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాత్మా బసవేశ్వరుడు కులరహిత, సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేసిన గొప్ప సంస్కర్త అని పేర్కొన్నారు. “కాయకవే కైలాసం” అనే సూత్రంతో శ్రమకు గౌరవం తీసుకొచ్చిన ఆయన బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వినయ్, వార్డు సభ్యులు మల్లయ్య, వీరన్న, రామన్న, రావి, మల్లప్ప, అంజన్న, బానాపురం రాజు, రుక్మిణి గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు ఆనంద్ స్వామి, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

బసవేశ్వరుని మార్గంలో నడవాలి – ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News