Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

బోగారం గ్రామంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

Updated : 29 Dec 2025 18:24 IST
As Preferred Source 1 min read
బోగారం గ్రామంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

ఇందిరా మహిళా శక్తి పథకం కింద బోగారంలో చీరల పంపిణీ కార్యక్రమం

రామన్నపేటస్థానిక ప్రతినిధి రామన్నపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో మహిళా సాధికారత దిశగా మరో కీలక అడుగు పడింది. గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నూతన సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ప్రారంభించి, మహిళలకు చీరలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని మహిళల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. త్వరలోనే మహిళా శక్తి భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే సంఘటిత శక్తి అవసరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్, గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్లు, గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు, వి.బి.కే సభ్యులు, గ్రామ మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

బోగారం గ్రామంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news