Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సౌత్‌-ఈస్ట్‌ ఏషియన్‌ కప్‌కు తెలంగాణ నుంచి ముగ్గురు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 11:03 AM

బానాపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు యూనిఫార్ములు అందజేత

23-01-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మండల పరిధిలోని బానాపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో చిన్నపిల్లలకు విద్యా యూనిఫార్ములు అందజేత కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుప్పాల అనిల్ పాల్గొని, పిల్లలకు నాణ్యమైన విద్య మరియు పుష్టికరమైన ఆహారం అందించాలని సూచించారు.అదేవిధంగా, అంగన్వాడి కేంద్రానికి మొదటిసారిగా విచ్చేసిన నూతన పాలకవర్గ సభ్యులను అంగన్వాడి ఉపాధ్యాయుడు బీరధర్ జగదీశ్వరి సన్మానం చేశారు. ఉపాధ్యాయుడు శాలువాతో కొత్త సభ్యులను ఆహ్వానించి, కేంద్ర అభివృద్ధికి తోడ్పడాలని ఆశాభావాలు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అల్కారి మహేశ్వరి, దుర్గయ్య, సత్యగమ చంద్రకళ విఠల్, ఉమేష్ గొల్ల, కురుమ సంఘం చైర్మన్ మల్లేశం, మాజీ విద్యా కమిటీ చైర్మన్ అంజయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అడివప్ప, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు మరియు పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని వీక్షించారు.కేంద్రంలో యూనిఫార్ములు అందజేత ద్వారా పిల్లలకు సౌకర్యవంతమైన విద్యా వాతావరణం ఏర్పడటం, విద్యాభ్యాసానికి ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా ఉంది. కార్యక్రమం ద్వారా చిన్నారులు మరింత ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా విద్యను పొందగలిగేలా ఏర్పాట్లు చేయడం జరిగింది.

Sthanikam

బానాపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు యూనిఫార్ములు అందజేత

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News