Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

బాలల దినోత్సవ వేడుకలతో కళకళలాడిన శ్రీ గురు సంకల్పం

Updated : 13 Nov 2026 19:41 IST
As Preferred Source 1 min read
బాలల దినోత్సవ వేడుకలతో కళకళలాడిన శ్రీ గురు సంకల్పం


శ్రీ గురు సంకల్పం విద్యాసంస్థలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా, ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సంస్థ ప్రెసిడెంట్ ఎస్. సుబ్బలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సృజనాత్మకతను అలవర్చుకోవాలని సూచించారు.

ఈ వేడుకల్లో సంస్థ ప్రతినిధులు నీలోఫర్, ఉమా రాణి భార్గవ, ఇందిరా రావు తదితరులు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వినోద్ తో పాటు సంస్థ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Sthanikam

బాలల దినోత్సవ వేడుకలతో కళకళలాడిన శ్రీ గురు సంకల్పం

Article Image


శ్రీ గురు సంకల్పం విద్యాసంస్థలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా, ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సంస్థ ప్రెసిడెంట్ ఎస్. సుబ్బలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సృజనాత్మకతను అలవర్చుకోవాలని సూచించారు.

ఈ వేడుకల్లో సంస్థ ప్రతినిధులు నీలోఫర్, ఉమా రాణి భార్గవ, ఇందిరా రావు తదితరులు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వినోద్ తో పాటు సంస్థ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి