Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:54 PM

బాదల్గాం గ్రామ సర్పంచ్ మమత నర్సింహులను ఘనంగా అభినందించిన మానవహక్కుల సంస్థ నాయకులు

18-01-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండల పరిధిలోని బాదల్గాం గ్రామ నూతన సర్పంచ్ మమత నర్సింహులును నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, న్యాల్కల్ మండల అధ్యక్షులు బి. నవీన్, బి. రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామానికి చెందిన విజయ్ కలిసి సర్పంచ్‌ను అభినందించారు. నూతనంగా సర్పంచ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, గ్రామాభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.అలాగే మహారాష్ట్ర రాష్ట్రం పూణే నగరంలో నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్ షాప్ కార్యక్రమంలో సర్పంచ్ మమత నర్సింహులు పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, గ్రామస్థాయి సమస్యలను జాతీయ స్థాయిలో చర్చించటం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.గ్రామాభివృద్ధి, సామాజిక న్యాయం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రజాప్రతినిధులు మరియు సామాజిక సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. బాదల్గాం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సమిష్టి కృషి అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో సాగగా, గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది.

Sthanikam

బాదల్గాం గ్రామ సర్పంచ్ మమత నర్సింహులను ఘనంగా అభినందించిన మానవహక్కుల సంస్థ నాయకులు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News