యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని హోమియోపతి ఆసుపత్రిలో "ఆయుష్" ఆధ్వర్యంలో 11 వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. రోగులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మణ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యశాస్త్రం అతి పురాతనమైన చికిత్సా విధానమని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అల్లోపతీ, హోమియోపతి మరియు ఆయుర్వేద వైద్య విధానంలో రోగులను పరీక్షించి చికిత్స చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటించి , నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలరని ఆయన అన్నారు. ఆయుష్ జిల్లా ఇంఛార్జి డాక్టర్ వి. విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సదస్సు, వైద్య శిబిరంలో జిల్లా ఆసుపత్రి ఆర్ ఎం ఓ డాక్టర్ చక్రధర్, జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దుర్గా ప్రకాష్, సామాజిక కార్యకర్తలు మాటూరి బాలేశ్వర్, జంపాల అంజయ్య, హోమియోపతి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ భారతి, డాక్టర్ సంద్య, డాక్టర్ అరుణ, ఫార్మాసిస్టు మంజుల, ఆసుపత్రి సిబ్బంది బాల లక్ష్మి, సంధ్యారాణి, అజీమ్, రమేష్, పలువురు రోగులు పాల్గొన్నారు.
ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా భువనగిరి లో సదస్సు , ఉచిత వైద్య శిబిరం

K.RAVI

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి