Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఒకే భూమిని పలువురికి విక్రయించే యత్నం.. ఏడుగురిపై కేసు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 27, 2026 07:28 PM

అశోక్‌ సింఘాల్‌ సేవలు చిరస్మరణీయం. దేశ ప్రగతికి జీవితాన్ని అంకితం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ.

27-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దేశ ప్రగతి, ప్రజా సంక్షేమానికి అశోక్‌ సింఘాల్‌ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అశోక్‌ సింఘాల్‌ శతజయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రధాని నివాళులర్పించారు.

‘పరోపకారార్థమిదం శరీరం’ అనే భారతీయ స్ఫూర్తికి సింఘాల్‌ ప్రతిరూపమని మోదీ అన్నారు. ఆధ్యాత్మికత, సాంస్కృతిక చైతన్యం, సంస్థాగత నిర్మాణంతోపాటు అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఆయన దశాబ్దాలపాటు కృషి చేశారని తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకునేవారని, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలిచేవారని పేర్కొన్నారు.2001 కచ్‌ భూకంపం సమయంలో సింఘాల్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని మోదీ గుర్తుచేసుకున్నారు. రామజన్మభూమి ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను ప్రస్తావించారు. సామాజిక ఐక్యత, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం ఆయన నిరంతరం కృషి చేశారని తెలిపారు.విద్య, ముఖ్యంగా వేద విద్యతోపాటు సంగీతంపై సింఘాల్‌కు ప్రత్యేక ఆసక్తి ఉండేదని మోదీ చెప్పారు. ‘ఏకల్‌ విద్యాలయ’ కార్యక్రమంతో ఆయనకు సన్నిహిత సంబంధం ఉండేదని పేర్కొన్నారు. పుస్తక పఠనం, సేవా భావాన్ని యువ కార్యకర్తల్లో పెంపొందించేందుకు ఆయన ప్రోత్సహించేవారని తెలిపారు.అశోక్‌ సింఘాల్‌ జీవితం, సేవా స్ఫూర్తి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని మోదీ అన్నారు. మాతృభూమి, ప్రజా సంక్షేమం కోసం ఆయన కన్న కలలను సాకారం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

అశోక్‌ సింఘాల్‌ సేవలు చిరస్మరణీయం. దేశ ప్రగతికి జీవితాన్ని అంకితం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News