Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐక్యతతో భక్తిశ్రద్ధల మధ్య గణనాథుడి నిమజ్జనం "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 23, 2026 10:03 PM

ఆరోగ్యకరమైన పంటలే లక్ష్యంగా పొలంబడి శిక్షణ

23-09-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. బుధవారం సుంకనపల్లి గ్రామంలో రైతు ఆవుల ఐలయ్య పొలంలో ఆత్మ పథకం ఆధ్వర్యంలో పొలంబడి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

కంపసాగర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ బి.అనిల్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై వరి సాగులో పాటించాల్సిన మెలకువలను వివరించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి వర్మీకంపోస్టు, పశువుల పేడ, గోమూత్ర ఆధారిత ద్రావణాలను వినియోగించాలని సూచించారు. వరి సాగుకు ముందు జనుము, జీలుగు వంటి పచ్చిరొట్ట పంటలు, అనంతరం అపరాల పంటలు సాగు చేయడం ద్వారా నేల సారాన్ని పెంచుకోవచ్చన్నారు.

సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య మాట్లాడుతూ గ్రామంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు మాట్లాడుతూ సహజ వ్యవసాయం చేపట్టే రైతులకు వ్యవసాయ శాఖ తరఫున అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించే బుక్లెట్లను రైతులకు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి నవీన్‌తో పాటు రైతులు గోపగోని కృష్ణయ్య, ఎర్రగోని వెంకటేష్, దేవనబోయిన రవి, బాతరాజు ముత్యాలు, భీమిడి నర్సిరెడ్డి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆరోగ్యకరమైన పంటలే లక్ష్యంగా పొలంబడి శిక్షణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News