అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి అన్నారు.శుక్రవారం కోదాడ పట్టణంలోని ఆర్‌ఎస్‌వీ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ పరిధిలో కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లను ఆమె లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు,గీత కార్మికులకు పింఛన్లు ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తాయని తెలిపారు.అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కోదాడ నియోజకవర్గంలో ఇప్పటికే 37,120 మంది ప్రతి నెలా పింఛన్లు పొందుతుండగా,కొత్తగా మరో 4,674 మందికి పింఛన్లు మంజూరయ్యాయని వెల్లడించారు. కొత్త పింఛన్లతో మరింత మంది పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత అందుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి