ఆనంద్‌రావు ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన
సూర్యాపేట ఆపరేషన్ వికటించడంతో తమ బాబు కోమాలోకి వెళ్లాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆనంద్‌రావు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమ బాబుకు వైద్యం అందించే క్రమంలో జరిగిన పరిణామాలపై ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని వారు ప్రశ్నించారు. బాబు ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని, జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి