నారాయణఖేడ్ మండలం పలుకుతాండకు చెందిన రాథోడ్ సురేష్ కుమారుడు హర్షవర్ధన్ (12) అనారోగ్యంతో మృతి చెందడంతో విషాదంలో ఉన్న కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. బాలుడి మృతి విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్,బీఆర్‌ఎస్ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన సూచనల మేరకు బాలుడి అంత్యక్రియల కోసం ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సంగ్యం సర్పంచ్ ధర్మానాయక్, జాదవ్ మారుతి నాయక్, జాదవ్ తరసింగ్, నీల్య నాయక్, దమ్లా నాయక్, విమ్ సింగ్ తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలిపారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తూ జీఎంఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు.
PRINT TIME: October 01, 2026 10:31 PM
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా జీఎంఆర్ ఫౌండేషన్

01-10-2026
19 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ మండలం పలుకుతాండకు చెందిన రాథోడ్ సురేష్ కుమారుడు హర్షవర్ధన్ (12) అనారోగ్యంతో మృతి చెందడంతో విషాదంలో ఉన్న కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. బాలుడి మృతి విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్,బీఆర్‌ఎస్ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన సూచనల మేరకు బాలుడి అంత్యక్రియల కోసం ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సంగ్యం సర్పంచ్ ధర్మానాయక్, జాదవ్ మారుతి నాయక్, జాదవ్ తరసింగ్, నీల్య నాయక్, దమ్లా నాయక్, విమ్ సింగ్ తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలిపారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తూ జీఎంఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి