స్వామివారి ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిరికొండ వెంకటేష్ కుటుంబం ముందుకొచ్చింది. బుధవారం ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించనుండగా, ఉదయం 11 గంటలకు స్వామివారి సన్నిధిలో అన్నప్రసాద వితరణ చేపట్టనున్నారు.
గ్రామానికి చెందిన శ్రీ సిరికొండ వెంకటేష్, ధర్మపత్ని సంతోష దంపతుల కుమారుడు భార్గవ్, సహోదరుడు వరుణ్, మాతృమూర్తి లలిత ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అన్నప్రసాద వితరణలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి