Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ముగ్గుల పోటీలో కొమిడాల అక్షర ప్రథమ బహుమతి. నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 25, 2026 10:17 AM

అక్రమంగా తరలిస్తున్న 7 గోవులు, 3 నందిమారాజులు స్వాధీనం

25-09-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తుని నుంచి బహదూర్‌పుర్‌కు తరలిస్తుండగా పట్టుకున్న చౌటుప్పల్

బజరంగ్‌దళ్ కార్యకర్తలు

చౌటుప్పల్ పోలీసులకు అప్పగింత

ఆంధ్రప్రదేశ్ పరిధిలోని తుని నుంచి హైదరాబాద్ బహదూర్‌పుర్‌కు చట్టవిరుద్ధంగా తరలిస్తున్న గోవులను, నందిమారాజులను బజరంగ్‌దళ్ కార్యకర్తలు చాకచక్యంగా పట్టుకున్నారు.వివరాల్లోకి వెళ్తే... తుని నుంచి ఓ వాహనంలో 7 గోవులు, 3 నందిమారాజులను క్రూరమైన రీతిలో కట్టేసి బహదూర్‌పుర్‌కు తరలిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న చౌటుప్పల్ బజరంగ్‌దళ్ కార్యకర్తలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్ర సమీపంలోని లక్కారం వద్ద వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనంలో మూగజీవాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి, వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం వాహనంతో సహా జీవాలను చౌటుప్పల్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Sthanikam

అక్రమంగా తరలిస్తున్న 7 గోవులు, 3 నందిమారాజులు స్వాధీనం

Article Image

తుని నుంచి బహదూర్‌పుర్‌కు తరలిస్తుండగా పట్టుకున్న చౌటుప్పల్

బజరంగ్‌దళ్ కార్యకర్తలు

చౌటుప్పల్ పోలీసులకు అప్పగింత

ఆంధ్రప్రదేశ్ పరిధిలోని తుని నుంచి హైదరాబాద్ బహదూర్‌పుర్‌కు చట్టవిరుద్ధంగా తరలిస్తున్న గోవులను, నందిమారాజులను బజరంగ్‌దళ్ కార్యకర్తలు చాకచక్యంగా పట్టుకున్నారు.వివరాల్లోకి వెళ్తే... తుని నుంచి ఓ వాహనంలో 7 గోవులు, 3 నందిమారాజులను క్రూరమైన రీతిలో కట్టేసి బహదూర్‌పుర్‌కు తరలిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న చౌటుప్పల్ బజరంగ్‌దళ్ కార్యకర్తలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్ర సమీపంలోని లక్కారం వద్ద వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనంలో మూగజీవాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి, వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం వాహనంతో సహా జీవాలను చౌటుప్పల్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News