Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కర్ర పూజలో పాల్గొన్న హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డీ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 09:39 PM

అక్రమంగా గ్యాస్ సిలిండర్ల దందా.. వ్యాపారిపై కేసు

02-10-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

టాటా ఏస్ వాహనం, 14 సిలిండర్లు స్వాధీనం

అక్రమంగా గ్యాస్ సిలిండర్లను భద్రపరిచి, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్న ఒక వ్యక్తిపై చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లభించిన నమ్మదగిన సమాచారం మేరకు చౌటుప్పల్ పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్/హెడ్ కానిస్టేబుల్ ఏ. సైదయ్య తమ సిబ్బందితో కలసి కొయ్యలగూడెం గ్రామంలో ఆకస్మిక దాడి (రైడ్) నిర్వహించారు.​ఈ దాడిలో కొయ్యలగూడెం గ్రామానికి చెందిన జబ్బారం గుజర్ (25, తండ్రి: అందారామ్, వృత్తి: వ్యాపారం) అనే వ్యక్తి అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి, అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. సంఘటనా స్థలంలో ఉన్న టాటా ఏస్ వాహనం (నెంబర్: TG 30T 3321) నుంచి​10 నిండిన పెద్ద ఇండియన్ గ్యాస్ సిలిండర్లు, ​2 నిండిన పెద్ద భారత్ గ్యాస్ సిలిండర్లు, ​2 చిన్న ఖాళీ గ్యాస్ సిలిండర్లు,ఒక పెద్ద ఇనుప రెగ్యులేటర్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.​ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మథ కుమార్ తెలిపారు. అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్‌లో విక్రయించినా చట్టపరమైన తీవ్ర చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Sthanikam

అక్రమంగా గ్యాస్ సిలిండర్ల దందా.. వ్యాపారిపై కేసు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News