Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

అక్రమ ఇసుక రవాణాకు చెక్.. రెండు లారీలు పట్టివేత

Updated : 23 Nov 2026 20:31 IST
As Preferred Source 1 min read
అక్రమ ఇసుక రవాణాకు చెక్.. రెండు లారీలు పట్టివేత

​125.260 మెట్రిక్ టన్నుల ఇసుక స్వాధీనం.. చౌటుప్పల్ పోలీసులకు అప్పగింత

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

ఎలాంటి అనుమతులు, వే బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలను గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులు పట్టుకున్నారు. సోమవారం తెల్లవారుజామున చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో మొత్తం 125.260 మెట్రిక్ టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.

​గనులు, భూగర్భ వనరుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. రాఘవరెడ్డి నేతృత్వంలోని సాంకేతిక బృందం సోమవారం చౌటుప్పల్ పరిధిలో తనిఖీలు చేపట్టింది. పంతంగి టోల్‌గేట్ వద్ద తెల్లవారుజామున 3 గంటల సమయంలో తనిఖీ చేయగా.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న TS 30 TA 5213 లారీని గుర్తించారు. ఇందులో 61.130 మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నట్లు తేల్చారు. లారీ డ్రైవర్ కర్నాటి రమేష్ (కొండాపురం, చండూరు మండలం), యజమాని కర్నాటి మణికుమార్ (పుట్టపాక, నారాయణపూర్ మండలం)గా గుర్తించారు.​అలాగే ఉదయం 6 గంటల సమయంలో అంకిరెడ్డిగూడెం గ్రామ సమీపంలోని దివీస్ కంపెనీ వద్ద తనిఖీలు నిర్వహించి.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కే వే బిల్లులు లేకుండా ఇసుక తరలిస్తున్న TG 07 W 3849 లారీని పట్టుకున్నారు. ఇందులో 64.130 మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్ బొమ్మరగోని బాల సిద్ధార్థ (వాయిలపల్లి, నారాయణపూర్ మండలం), క్లీనర్ దామెర హనుమాన్ (షిర్దాపల్లి, చండూరు మండలం), యజమాని బండమీది స్వామి (సాయగోనిగూడెం, నారాయణపూర్ మండలం)గా నిర్ధారించారు.​రెండు వాహనాల్లో కలిపి 125.260 మెట్రిక్ టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్న మైనింగ్ అధికారులు.. తదుపరి చర్యల నిమిత్తం లారీలను చౌటుప్పల్ పోలీసులకు అప్పగించారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

అక్రమ ఇసుక రవాణాకు చెక్.. రెండు లారీలు పట్టివేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి