విగ్రహానికి పూలమాలలు వేసిన బీసీ సంక్షేమ సంఘ నాయకులు
తెలంగాణ సాయుధ పోరాట యోధోమణి వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో బీసీ సంక్షేమ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... తెలంగాణ నేలపై సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని స్మరించుకున్నారు. ఆమె చూపిన పోరాట పటిమను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ బొంగు జంగయ్య గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, కో-ఆప్షన్ మెంబర్ గంగ రాములు, ఊడుగు రమేష్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు ఆదిమూలం శంకర్, టీఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ మండల అధ్యక్షుడు నరి నరసింహ, బీసీ ఐటీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ సూర్య అన్నబోయిన, నాయకులు మలిగే నర్సింహ, వీరమళ్ళ యాదయ్య, బాతరాజు యాదయ్య, మలిగే బాలరాజ్, లింగస్వామి, రమేష్, రాజు, పాండు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి