చిట్యాల: మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో రామదండు యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం గణనాథుడి నిమజ్జనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికుమార్–స్పందన దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలను ప్రజలంతా ఐక్యతతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రామదండు యువసేన సభ్యులు, 9వ వార్డు ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి