చివరి మజిలీలోనూ తప్పని అవస్థలు.. చిట్యాల మున్సిపాలిటీలో దుస్థితి.
చిట్యాల: మనిషి జీవితంలో చివరి మజిలీ అయిన వైకుంఠధామంలోనూ అవస్థలు తప్పడం లేదు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వైకుంఠధామంలో రాత్రివేళ విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో దహన సంస్కారాలకు వచ్చిన కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకట్లో అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.
వైకుంఠధామంలో లైటింగ్ సదుపాయం సరిగా లేకపోవడంతో దహన సంస్కారాల సమయంలో సెల్‌ఫోన్ టార్చ్ లైట్లను ఆశ్రయించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం చివరి మజిలీలోనైనా ప్రజలకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాల్సిన మున్సిపల్ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వైకుంఠధామంలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి, రాత్రివేళ దహన సంస్కారాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి లైటింగ్ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి