Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

అభివృద్ధి పనులను రాజకీయం చేయడం మానుకోవాలి

Updated : 02 Oct 2026 04:20 IST
As Preferred Source 1 min read
అభివృద్ధి పనులను రాజకీయం చేయడం మానుకోవాలి

కోదాడ పట్టణంలోని 100 పడకల ప్రభుత్వాసుపత్రి విషయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నమేనని కాంగ్రెస్‌ నాయకుడు రావెళ్ల కృష్ణారావు విమర్శించారు. జీవోను చూపిస్తూ మొత్తం ఘనతను తన ఖాతాలో వేసుకోవడం సరికాదని, జీవో జారీ చేయడంతోనే ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వచ్చినట్లు కాదని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అనుభవించిన మల్లయ్య యాదవ్‌.. తన హయాంలో ఆసుపత్రి పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి పనులపై రాజకీయ ఆరోపణలు చేయడం మానుకుని వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేపై కమీషన్ల ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని, ఆరోపణలకు ఆధారాలుంటే ప్రజల ముందు ఉంచాలని, ఎవరి నుంచి ఎంత మొత్తం తీసుకున్నారో ఆధారాలతో వెల్లడించాలని సవాల్‌ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంగానే భావించాల్సి వస్తుందని అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కోదాడ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఏ పనులు పూర్తయ్యాయి, ఏవి అసంపూర్తిగా మిగిలాయి అన్నది ప్రజలకు స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులపై ప్రజలకు సమాధానం చెప్పకుండా ఇప్పుడు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు చేయడం వల్ల వాస్తవాలు మారవని అన్నారు. ప్రభుత్వాసుపత్రి, డయాలసిస్‌ కేంద్రం వంటి ప్రజా ఆరోగ్య అంశాలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం తగదని, ప్రజల ప్రాణాలు, ఆరోగ్యానికి సంబంధించిన సేవల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కోదాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని, గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులు, పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, వాటి పురోగతిపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమని తెలిపారు. “జీవోలు, శిలాఫలకాల చుట్టూ తిరిగే రాజకీయాలు కాదు.. పనులు పూర్తిచేసి ప్రజలకు ఫలితాలు అందించే రాజకీయాలు కావాలి. ఎవరి హయాంలో ఏం జరిగిందో కోదాడ ప్రజలకు అన్నీ తెలుసు. గతాన్ని మరిపించేందుకు ఆరోపణలు చేసినంత మాత్రాన వాస్తవాలు కనుమరుగుకావు” అని రావెళ్ల కృష్ణారావు స్పష్టం చేశారు.

Sthanikam

అభివృద్ధి పనులను రాజకీయం చేయడం మానుకోవాలి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి